GUNTUR DISTRICT NEWS: మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణ

Karthik
1 View

మానవత ఉచిత టైలరింగ్ శిక్షణ ఘనంగా ప్రారంభం మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణే ఉత్తమ మార్గమని ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్. చైతన్య కుమారి అన్నారు. మానవతా సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ఆదివారం మానవత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ యం. ఎస్. చైతన్య కుమారి మాట్లాడుతూ, మారుతున్న సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక డిమాండ్ ఉన్న టైలరింగ్ రంగంలో మహిళలు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారా మంచి పేరు సంపాదించవచ్చని తెలిపారు.మరో ముఖ్య అతిథి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, మానవతా సంస్థ అందిస్తున్న ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేర్చుకున్న నైపుణ్యాన్ని సాధన చేస్తూ మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు. సామాజిక సేవా సంస్థలను కలుపుతూ “కనెక్ట్” కార్యక్రమం ద్వారా మరింత సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.మానవత సంస్థ చైర్మన్ పావులూరు రమేష్ సంస్థ నిర్వహిస్తున్న వివిధ సేవలను వివరించారు. ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు మహిళలు ఈ శిక్షణను తప్పక నేర్చుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.సంస్థ సెక్రటరీ కే. సతీష్ మాట్లాడుతూ, ఈ ఉచిత టైలరింగ్ శిక్షణ 90 రోజులపాటు కొనసాగుతుందని, ప్రతిరోజు రెండు గంటల శిక్షణలో ఒక గంట సిద్ధాంత బోధన, కటింగ్ డెమో మరియు మరో గంట ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి వారం పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌తో పాటు మార్కెటింగ్, బ్యాంకు లోన్ సౌకర్యాలపై మార్గదర్శకత కూడా అందిస్తామని వివరించారు.టైలరింగ్ శిక్షకురాలు కే. రామసేత మాట్లాడుతూ, నేటి మహిళలకు అవసరమైన అన్ని రకాల కుట్టు నైపుణ్యాలను ఉచితంగా నేర్పిస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో ప్రముఖ అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ట్రెజరర్ టి. సాయిరాం వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ డైరెక్టర్లు బాలకృష్ణ చౌదరి, మిత్ర, సూర్యదేవర కృష్ణ ప్రసాద్, తిరుపతి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్పన, జాయింట్ సెక్రటరీ ఆనంద్, శివాజీ, కే. ఉమామహేశ్వరరావు, మేనేజర్ రాధాకృష్ణ, అలా అనంతరామయ్య, మోహన్ రావు, జాయిన్ జాయ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కైలాసనాథ్, సాగర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Author
Total Views: 1
Share This Article
Leave a review