గుడివాడ :– కృష్ణా జిల్లా మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ‘మేడ్ ఇన్ గుడివాడ’ బ్రాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడ ప్రజావేదికలో మున్సిపల్ ఆర్పీలు, సమైక్యల కమిటీ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ಮಾತలాడుతూ… మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) నైపుణ్యాలను గుర్తించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. గుడివాడకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
అమెరికా మార్కెట్‌కు గుడివాడ ఉత్పత్తులు! ఉత్పత్తుల తయారీతో పాటు వాటికి సరైన బ్రాండింగ్, నాణ్యమైన ప్యాకేజింగ్, సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ఎంతో కీలకమని వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు. గుడివాడలో మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు.Krishna district news
మహిళలకు ఆధునిక శిక్షణ అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను వినియోగిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ రంగంలో మహిళలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెప్మా సీవోలు, ఆర్పీలు, పీఎల్ఎఫ్ (PLF) కమిటీ ఆఫీస్ బేరర్లు మరియు పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.



