గుంటూరులో ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. డ్రెయిన్ల నిర్మాణం వేగవంతం చేయండి. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రెయిన్లు, రోడ్లు, విద్యుత్ సరఫరా ట్రాఫిక్ వంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ శానిటేషన్, విద్యుత్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ పోలీసు అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత జిన్నా టవర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు చేపట్టిన డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాంతం ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని, త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించాను. మణిపురం బ్రిడ్జి వెంట సర్వీసు రోడ్డులో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో కలిసి కబడ్డీ గూడెం ప్రాంతంలో పర్యటించాను. అక్కడ డ్రెయున్ల విస్తరణతోపాటు శ్మశాన వాటికలో వసతుల కల్పనపై చర్చించారు. కొత్తపేటలోని బ్రింద న్యూరో కేర్ వద్ద డ్రెయిన్ నిర్మాణంపై చర్చించారు. అదే సమయంలో ఆటోనగర్ ప్రధాన డ్రెయిన్ నిర్మాణం విషయంలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించాను. ఆటోనగర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాంతాన్ని సమాన స్థాయిలో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నామని చెప్పడానికి సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు.
GUNTUR CITY NEWS: యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టండి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
overcast clouds
30° _ 30°
62%
7 km/h
Tue
34 °C
Wed
32 °C
Thu
32 °C


