GUNTUR DISTRICT NEWS: ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి

Karthik

ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి*గుంటూరు, అక్టోబర్ 11 :  స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సున్నిత, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు అన్ని పోలింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది శిక్షణ, పోలింగ్ సామగ్రి సమకూర్చడం, వెబ్ కాస్టింగ్, పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి అంశంపై స్పష్టత ఉండాలని అన్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనల మేరకు ప్రతి అంశాన్ని చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review