పొన్నూరు పట్టణం 29వ వార్డులో నూరానీ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.డి. ఫారుక్ షుభ్లీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం ఇటువంటి శిక్షణ కేంద్రాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నూరానీ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, టైలరింగ్ కోర్సులు ప్రారంభించబడినట్లు తెలిపారు. ఈ కోర్సులకు అవసరమైన కంప్యూటర్లు, పుస్తకాలు, స్టేషనరీ, కుట్టుమిషన్లు పూర్తిగా ఉచితంగా అందించబడనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
GUNTUR DISTRICT NEWS: మైనార్టీ మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
29°C
Vijayawada
overcast clouds
29° _ 29°
76%
2 km/h
Tue
34 °C
Wed
35 °C
Thu
34 °C


