Hyderabad City News :గణేష్ నిమజ్జన బందోబస్తులో విషాదం.. కొత్తగూడెం టూ టౌన్ ఎస్‌ఐ వెంకన్న మృతి

Sharat
1 View

హైదరాబాద్: గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె. వెంకన్న మృతి చెందారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 22/23వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎస్‌ఐ కె. వెంకన్న హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ మార్గ్‌లో క్రేన్-2 వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వెంకన్న కుడి కాలికి స్వల్ప గాయాలయ్యాయి.Hyderabad City News

ప్రమాదం అనంతరం వెంకన్న కొత్తగూడెంలోని తన నివాసానికి వెళ్లారు. అయితే ఒంటినొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా బుధవారం సాయంత్రం 5:50 గంటలకు వెంకన్న తుదిశ్వాస విడిచారు.

వెంకన్న మృతితో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Author
Share This Article
Leave a review