ప్రతి గర్భిణీ వివరాలు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై జాయింట్ కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. గర్భం దాల్చిన వెంటనే గర్భిణీల వివరాలు నమోదు చేయాలన్నారు. ఒక్క గర్భిణి వివరాలు కూడా తప్పిపోరాదని స్పష్టం చేశారు. గర్భిణీల పూర్తి వివరాలు నమోదు చేయడం వలన హై రిస్క్ కేసులను నివారించుటకు తోడ్పడుతుందని చెప్పారు. రక్త హీనత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌష్టిక ఆహారం అందడమే కాకుండా, దానిని వారు మాత్రమే తీసుకునే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రసవ తేదీలను కూడా ముందుగానే గుర్తించడం వల్ల ఆసుపత్రుల్లో చేర్చవచ్చని అన్నారు. ఆసుపత్రిలోనే ప్రసవం కావడానికి ప్రేరణ కల్పించాలని సూచించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీల నివారణకు చర్యలు తీసుకోవాలని, దాని వలన కలిగే అనర్థాలను తెలియజేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందించి ఆరోగ్యంగా పెరుగుటకు కృషి చేయాలని అన్నారు. నిర్ణీత సమయంలో వారి ఎత్తు, బరువును గమనించాలని, వయస్సుకు తగిన విధంగా లేనప్పుడు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆటపాటల ద్వారా విద్యను అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుండి బయటకు వెళ్ళే చిన్నారులు ఒకటవ తరగతిలో విధిగా చేరేటట్లు శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. చిన్నారుల ఆరోగ్యం, అభ్యసన, ప్రాథమిక పాఠశాలలో చేరటం అంశాలను ట్రాక్ చేయాలని, అందుకు సమగ్రమైన రికార్డు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీల ద్వారా మంచి సేవలు చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అందుటకు పర్యవేక్షణ చేయాలని అన్నారు. అంగన్వాడీలలో మంచి సేవలు అందుతుందని గ్రామస్తులు ప్రశంసించే స్థాయికి తీసుకురావాలని చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి ప్రతీక అన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.జి.ప్రసూన, సి.డి.పి.ఓలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: ప్రతి గర్భిణీ వివరాలు నమోదు చేయాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
clear sky
26° _ 26°
88%
1 km/h
Fri
34 °C
Sat
35 °C
Sun
33 °C


