GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Karthik

గుంటూరు నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు తెలిపారు. నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధుల కేటాయించబడిన 30 మంది ఆర్ఓలు, 84 మంది ఏఆర్ఓలకు, జోనల్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, ఆర్ఓలు, ఏఆర్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడైనా కనీస వసతులు లేకుంటే సంబందిత ఏఈకి తెలియచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులపై ఎన్నికల కమిషన్ అందించిన నిబందనావళిపై అవగాహన కల్గి ఉండాలన్నారు. ఏ సందేహం ఉన్నా స్వంత నిర్ణయాలు కాకుండా నిర్దేశిత ఆర్ఓ హ్యాండ్ బుక్ లోని నిబందనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు గడువు అతి తక్కువ సమయం ఉంటుందని, అందుకు ప్రతి గంట కీలకంగానే వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి వార్డ్ కి ప్లానింగ్, అడ్మిన్ లతో ప్రత్యేకంగా ఎన్నికల విధులకు సహాయకారిగా ఉండెందుకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఎన్నికల విధుల్లో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా చేయాలన్నారు.అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్గిస్తూ, హాజరైన వారి సందేహాలను నివృత్తి చేశారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review