Markapur District City News :మార్కాపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా-రెగ్యులర్ చేయాలని.. 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్

S Sarath
2 Views

మార్కాపురం:- మార్కాపురం జీజీహెచ్‌ ప్రాంగణంలో కాంట్రాక్ట్, పారామెడికల్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్, పారామెడికల్ సిబ్బంది మార్కాపురం జీజీహెచ్‌కు తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ల్యాబొరేటరీ, స్కానింగ్, ఎక్స్‌రే తదితర విభాగాలకు చెందిన సిబ్బంది కూడా సమ్మెలో భాగస్వాములయ్యారు.Markapuram District City News :ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ- ఆర్థిక స్వాలంబనకు బాటలు వేస్తున్న “జననీ చారిటబుల్ ట్రస్ట్”

అత్యవసర సేవలను మినహాయించి మిగిలిన సేవలను కాంట్రాక్ట్ ఉద్యోగులు బహిష్కరించారు. తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

Author
Share This Article
Leave a review