హైదరాబాద్: అమాయక ప్రజల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని కోట్లకు పడగలెత్తిన ఓ భారీ మోసగాడి ఆట కట్టించారు మీర్ చౌక్ పోలీసులు. ‘ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్’ (Forever Living Products) పేరుతో నడుస్తున్న భారీ మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) ఫ్రాడ్‌ను పోలీసులు చేధించారు.

ముఖ్య విషయాలు:
- నేపథ్యం: డిజిటల్ మార్కెటింగ్ ముసుగులో యువతను, సామాన్యులను టార్గెట్ చేసిన నిందితుడు.
- దర్యాప్తు: సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, ఐపీఎస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన విచారణలో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు.
- మోసపు తీరు: “తక్కువ సమయంలో.. ఎక్కువ సంపాదన” అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో వల వేయడం.
ఎలా మోసం చేసేవారంటే..?
నిందితుడు అత్యంత పకడ్బందీగా ఈ నెట్‌వర్క్‌ను నడిపించినట్లు పోలీసులు గుర్తించారు:
- రిజిస్ట్రేషన్ ఫీజు: ఆన్లైన్ క్లాసులు, ట్రైనింగ్ సెషన్ల పేరుతో ప్రాథమికంగా రూ. 199 నుండి రూ. 249 వరకు వసూలు చేసేవారు.
- ఈవెంట్స్: దేశవ్యాప్తంగా భారీ మీటింగ్స్, కలర్‌ఫుల్ ఈవెంట్స్ నిర్వహించి.. విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తూ కొత్త సభ్యులను ఆకర్షించేవారు.
- ట్రాక్ ప్యాకేజీలు: ఇందులో సభ్యులుగా చేరిన వారికి IST, MT, FT అనే వివిధ పేర్లతో ఖరీదైన ప్యాకేజీలను ఆశ చూపి భారీ మొత్తంలో డబ్బులు గుంజేవారు.
పోలీసుల హెచ్చరిక: తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పే ఆన్లైన్ స్కీములను నమ్మవద్దని, ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సంస్థల విశ్వసనీయతను తనిఖీ చేసుకోవాలని డీసీపీ కిరణ్ ఖరే సూచించారు.
ప్రస్తుతం ఈ కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Total Views: 1



