ప్రతి మహిళ సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ‘మహిళా గ్రీవెన్స్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి గురువారం నియోజకవర్గ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్‌ను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, మహిళలు ఎంతో స్వేచ్ఛగా కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుని, పరిష్కారం పొందుతుండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా తోటి మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి ఒక పరిష్కార మార్గం చూపించడం అత్యంత సంతృప్తికరమైన పనిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రీవెన్స్‌లో భాగంగా ఈరోజు ఆర్థికంగా నష్టపోయిన, మోసపోయిన మహిళల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీల విషయంలో మహిళలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరి మాటలో నమ్మి మోసపోయి, తద్వారా కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా ప్రతి మహిళా జాగ్రత్తగా ఆలోచించాలని హితవు పలికారు.అలాగే, నియోజకవర్గంలోని కొన్ని కొత్త ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతుల కల్పన, మరికొన్ని ప్రాంతాల్లో మంచినీటి సమస్యలపై మహిళలు అర్జీలు అందించారని తెలిపారు. వీటితో పాటు పోలీస్ స్టేషన్ కేసులు, విద్యార్థుల సర్టిఫికెట్ల సంబంధిత సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయన్నారు. ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రతి మహిళ సమస్యలు లేకుండా ఉండాలన్నదే మా లక్ష్యం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
few clouds
31° _ 31°
45%
2 km/h
Thu
31 °C
Fri
31 °C
Sat
30 °C


