GUNTUR DISTRICT NEWS: గుంటూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తాం

Karthik

గుంటూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. గుంటూరులోని ప్రెస్ క్లబ్ ను మంగళవారం ఆయన సందర్శించారు. APUWJ జిల్లా కార్యదర్శి కె. రాంబాబు ఎంపీ భాష్యం రామకృష్ణకు స్వాగతం పలికారు. కొన్ని దశాబ్దాల నుండి గుంటూరులో ప్రెస్ క్లబ్ కు శాస్వత భవనం లేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. కీలకమైన అమరావతి రాజధాని ఉన్న గుంటూరు జిల్లాలో ప్రెస్ క్లబ్ లేకపోవడం బాధాకరమని చెప్పారు. దీనికి ఎంపీ స్పందిస్తూ శాస్వత ప్రెస్ క్లబ్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. త్వరలో గుంటూరు నగరంలో ఆధునిక సౌకర్యాలతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ కార్యాలయాన్ని కూడా ఎంపీ రామకృష్ణ సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ వారికి అండగా నిలవాలని సూచించారు.

Author
Share This Article
Leave a review