GUNTUR CITY NEWS: పోలేరమ్మ తల్లి ఆలయంలో వైభవంగా పొంగళ్ళ మహోత్సవం

Karthik
2 Views

పవిత్ర శ్రావణమాసం వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ల మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా దైవదర్శనం గావించారు. పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరులోని ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Author
Share This Article
Leave a review