GUNTUR DISTRICT NEWS: ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు వారధి ప్రజా దర్బార్.

Karthik

ప్రజా సమస్యలు,వాటి పరిష్కారానికి ప్రజా దర్బార్ వారధిగా నిలుస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి మరికొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి, ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రతీ అర్జీ పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం PGRS కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review