చిన్నగంజాం:04-10-26:- మండలంలోని సోపిరాల గ్రామంలో శ్రీ లలితపరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.Bapatla District City News
ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు పూజా కార్యక్రమాలను వీక్షించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనదలచిన భక్తులు ఆలయ పూజారి శంకరమంచి హనుమంతరావును సంప్రదించాలని తెలిపారు.



