Markapuram district news :స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి-పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి- దద్దాల నారాయణ యాదవ్

Sharat
2 Views

పామూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. పామూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం మండల స్థాయి సమావేశం, పార్టీ కమిటీ సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసుకునేందుకు కీలకమని అన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పార్టీ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు.మార్కాపురం

కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో మండల పార్టీ నాయకులు గంగసాని హుస్సేన్‌రెడ్డి, గంగసాని లక్ష్మీ, చప్పిడి సుబ్బయ్య, కల్లూరి రామిరెడ్డి, గట్ల విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఐక్యంగా సిద్ధమై పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

Author
Share This Article
Leave a review