దర్శి:– ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సామంతపూడి పీఎస్ హెచ్ఎం పసుపులేటి రవిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పసుపులేటి రవికి కాంప్లెక్స్ చైర్మన్, మండల విద్యాశాఖ అధికారి మాలకొండయ్యతో పాటు ఉపాధ్యాయులు శాలువా కప్పి, పుష్పమాలలు వేసి అభినందనలు తెలిపారు. విద్యారంగంలో రవి అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు.Prakasam district news :దర్శిలో ఉపశమనం- బానుడి తాపానికి వర్షంతో చెక్ — వర్షంలో తడిసిన రోడ్లు, ఉప్పొంగిన రైతాంగం
ఎంఈవో మాలకొండయ్య మాట్లాడుతూ.. మానవతా విలువలు కలిగిన ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా రవి పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం అందరికీ ఆనందం కలిగించే విషయమన్నారు. విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ, తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం అవార్డు గ్రహీత పసుపులేటి రవిని ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దర్శి మండల కాంప్లెక్స్ చైర్మన్ రంగారావు, రిసోర్స్ పర్సన్ రాజశేఖర్, పసుపులేటి నారాయణతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



