Machilipatnam distric News :సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026 అమలులో రాజీ లేదుబల్క్ వేస్ట్ జనరేటర్లు సొంత ప్రాంగణాల్లోనే వ్యర్థాల ప్రాసెసింగ్ తప్పనిసరిఆగస్టు 10న వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు

Sharat
1 View

మచిలీపట్నం, ఆగస్టు 6 :– సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026ను జిల్లాలో కచ్చితంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ప్రకటించారు. అధిక మొత్తంలో ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లు ఇకపై స్థానిక సంస్థలపై ఆధారపడకుండా తమ సొంత ప్రాంగణాల్లోనే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలుపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఆగస్టు 10న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ కానూరులోని వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గురువారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు కఠిన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. వాటి అమలుకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించడంతో జిల్లాలో నిబంధనలను కచ్చితంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటి అధిక పరిమాణంలో ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే అన్ని బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ ప్రాంగణాల్లోనే శాస్త్రీయంగా వ్యర్థాలను ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇకపై మున్సిపాలిటీలు లేదా గ్రామపంచాయతీల ద్వారా వ్యర్థాల నిర్వహణపై ఆధారపడే అవకాశం ఉండదని, ప్రతి సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ప్రాసెసింగ్ విధానాలు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిష్కారాలపై నిపుణులు ఆగస్టు 10న నిర్వహించే అవగాహన సదస్సులో వివరాలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని బల్క్ వేస్ట్ జనరేటర్లు ఈ సదస్సుకు తప్పనిసరిగా హాజరై నిబంధనలపై పూర్తి అవగాహన పొందాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలు చేయని సంస్థలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలో నిబంధనల అమలుపై తీసుకుంటున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉన్నందున ప్రతి సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Author
Share This Article
Leave a review