దేశ సంస్కృతి సంప్రదాయాలు తరువాతి తరాలకు అందించటానికి మ్యూజియంలు ఎంతో అవసరం. పాత రాతియుగం నాటి మానవుని ఆయుధాల వద్దనుండి ప్రస్తుతం ఉన్న అదునాతన టెక్నాలజీ ని కూడా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్దులకు చేరువచేయటానికి ఈ ప్రదర్శన శాలలు అత్యవసరం అటువంటి ప్రదర్శన శాలల గురించి ప్రజలకు అవగాహన కల్పించటానికి 1977 లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం ల సంస్ద ప్రతి సంవత్సరం మే 18 వ తారీఖున ప్రపంచ మ్యూజియంల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది. అప్పటి నుండి ఈ రోజున పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటిలో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలోని బౌధ్ద సిరి మ్యూజియంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ పర్యాటక సంస్ధ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ లు సంయుక్తంగా నిర్విహంచిన ఈ కార్యక్రమంలో విద్యార్దులను మ్యూజియం కు తీసుకువచ్చి, దాని ప్రాశస్త్యాన్ని ప్రముఖ చరిత్ర నిపుణులు శ్రీనాధ్ రెడ్డి వారికి అర్దమయే రీతిలో వివరించారు. అలాగే మ్యూజియం రంగంలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి కూడా ఆయన విద్యార్దులకు తెలిపారు. కార్యక్రమంలో పాల్గోన్న విద్యార్దలు, తమకు తెలియని ఎన్నో విషయాలను ఈ రోజు తెలుసుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంటాక్ గుంటూరు చాప్టర్ కన్వీనర్ ముదిగోండ రవిశంకర్, గుంటూరు జిల్లా పర్యాటక అధికారి రమ్య, ఇంటాక్ కో కన్వీనర్ వేణుగోపాల్, సభ్యులు జాస్తి వీరాంజనేయులు, విజయ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు. కార్యక్రమానికి మేకల రవీంద్ర తనవంతు సహాకారన్ని అందించారు.
GUNTUR DISTRICT NEWS: గుంటూరులో మ్యూజియంని సందర్శించిన విద్యార్థులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
overcast clouds
30° _ 30°
78%
5 km/h
Tue
43 °C
Wed
46 °C
Thu
48 °C


