మహాత్మా గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛతను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సమష్టిగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసే దిశగా వివిధ సంస్కరణలు చేపడుతోందన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు లేదా పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, జిల్లా లోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సాధారణంగా స్వచ్ఛత అవార్డులు పట్టణ, గ్రామీణ పారిశుద్ధ్య విభాగాలకు మాత్రమే పరిమితమవుతాయని, అయితే ఈసారి అన్ని శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య ఆరోగ్య సంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజల్లో ఆదర్శంగా పనిచేస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛత అనేది అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.*గుంటూరు జిల్లాకు పలు అవార్డులు*రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డుల్లో గుంటూరు జిల్లాకు చెందిన నాలుగు పట్టణ స్థానిక సంస్థలు—గుంటూరు, తెనాలి, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు—అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు. గుంటూరు నగరానికి స్వచ్ఛ వాయు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రెండో స్థానం లభించడం జిల్లాకు గర్వకారణమన్నారు.రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ గ్రామ పంచాయతీగా నంబూరు, స్వచ్ఛ పాఠశాలగా నిడమర్రు, స్వచ్ఛ ఆసుపత్రిగా యూపీహెచ్‌సీ ఇందిరానగర్, స్వచ్ఛ పరిశ్రమగా దుగ్గిరాల కాంటినెంటల్ కాఫీ ఎంపికైనట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో 62 మందికి స్వచ్ఛత అవార్డులు లభించాయని పేర్కొన్నారు.ఈ విజయాలు ఏ ఒక్కరి కృషి వల్ల సాధ్యమైనవి కావని, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రజల సమష్టి కృషి ఫలితమేనని కలెక్టర్ తెలిపారు. *ఇంటి నుంచే స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలి*స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు, కార్యాలయం నుంచే ప్రారంభించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటే సిబ్బందిలో సానుకూల ఆలోచనలు, మెరుగైన పని వాతావరణం ఏర్పడుతుందన్నారు.తమ కుటుంబ సభ్యులను సైతం ఎటువంటి సంకోచం లేకుండా కార్యాలయానికి తీసుకువచ్చి, “ఇది నేను పనిచేసే కార్యాలయం” అని గర్వంగా చూపించగలిగే స్థాయిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.గుంటూరు జిల్లా ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందని, ఇది మరింత మెరుగైన పనితీరుకు స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ జిల్లాకు గుర్తింపు వచ్చేలా అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. *స్వచ్ఛత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత*– *ఎమ్మెల్యే నజీర్* స్వచ్ఛత అనేది కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అంశమని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. స్వచ్ఛతా అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో స్వచ్ఛతను ప్రజలందరి భాగస్వామ్యంతో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వ్యర్థాలను సంపదగా మార్చే విధానాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చన్నారు.పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తున్నందున వారికి ప్రజలు సహకరించాలని, రోడ్లపై చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.*పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి*…..*ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్*మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. స్వచ్ఛతా అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ ఎంతో అంకితభావంతో అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం వారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.బాధ్యతారాహిత్యంతోనే అనేక ప్రాంతాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నామని, ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయడం, తడి–పొడి చెత్తను వేరు చేయడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.పరిశుభ్రతను చిన్ననాటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలని, అప్పుడే భవిష్యత్ తరాల్లో స్వచ్ఛతపై బాధ్యతాయుతమైన భావన పెంపొందుతుందని అన్నారు. “ప్రతి ప్రదేశం మనదే” అనే భావనతో వ్యవహరించినప్పుడే మన పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచగలమని తెలిపారు.అవార్డులు కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.పారిశుధ్యం ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని, అది నిరంతర ప్రక్రియ అని అన్నారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు.ప్రతి పనిలో దైవత్వాన్ని చూసినప్పుడే ఆ పనిని అంకితభావంతో, పరిపూర్ణంగా నిర్వహించగలమని ఆయన అన్నారు. అదే విధంగా పారిశుధ్యాన్ని కూడా ఒక పవిత్రమైన సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎన్ ఎస్ కె.ఖాజావలి, మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కిషోర్, జడ్పీ సీఈవో జ్యోతి బసు , డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి, బిజెపి జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
25°C
Vijayawada
scattered clouds
25° _ 25°
90%
1 km/h
Sat
33 °C
Sun
33 °C
Mon
34 °C


