Bapatla District City News :వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుఫాను బాధితులకు ఆహారం పంపిణీ చేసిన కమిషనర్-రాత్రివేళ స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి భోజనం అందించిన బాపట్ల కమిషనర్ యం. హాసిని

S Sarath
1 View

బాపట్ల :- మురసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాపట్ల మున్సిపల్ కమిషనర్ యం. హాసిని తుఫాను బాధితులకు అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి కర్లపాలెం రోడ్డులోని మాదాల నారాయణస్వామి కాలనీలో పర్యటించి, తుఫాను ప్రభావిత ప్రజలకు స్వయంగా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల వద్దకు వెళ్లిన కమిషనర్ బాధితులకు ఆహారం అందించడంతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, అవసరమైన సహాయక చర్యలపై దృష్టి సారించారు.Bapatla District City News

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రివేళ ప్రజల మధ్యకు వెళ్లి స్వయంగా ఆహారం పంపిణీ చేయడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో బాధితులకు కమిషనర్ భరోసా కల్పించారు.

Author
Share This Article
Leave a review