GUNTUR DISTRICT NEWS: వీఆర్వోల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా కసుకుర్తి శ్రీనివాసరావు

Karthik

జిల్లాలో విఆర్వోల ఐక్యతను చాటుతూ సమస్యల పరిష్కారానికి ముందుండి నడిపిస్తారని ఏపీ వీఆర్వో అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కసుకుర్తి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్లో ఏపీ వీఆర్వో అసోసియేషన్ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షునిగా కసుకుర్తి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన కసుకుర్తి శ్రీనివాసరావును అసోసియేషన్ నాయకులు తోటి వీఆర్వోలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నూతన అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు ఇచ్చింది పదవి కాదని బాధ్యత అని దీనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలిపారు. గుంటూరు జిల్లాలో విఆర్వోల అందరిని ఏకతాటిపైకి తీసుకొస్తానని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతార అధికారుల మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వీటన్నిటిపై సమగ్ర కార్యచరణ రూపొందించి ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు అనంతరం నూతన ఏపీ వీఆర్వో అసోసియేషన్ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కసుకుర్తి శ్రీనివాసరావును ఏపీ ఆర్ ఎస్ ఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వీఆర్వోల సమైక్యతను చాటాలని సూచించారు కార్యక్రమంలో ఏపీ వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర రామారావు అసోసియేట్ ప్రెసిడెంట్ ఆయూబ్ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, వీరయ్య, వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలు శ్రీనివాసరావు, బోసు బాబు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review