GUNTUR DISTRICT NEWS: పూర్తి చేసిన పనుల బిల్లులు తక్షణం అప్ లోడ్ చేయాలి

Karthik

విబి జి రామ్ జి పథకం కింద పూర్తి చేసిన పనుల బిల్లులు శుక్రవారం నాటికి అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విబి జి రామ్ జి క్రింద కొన్ని మండలాల్లో మంజూరు చేసిన పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం పట్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ప్రశ్నించారు. ముందుగానే గుర్తించినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె పండగ 3.0 క్రింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాపై స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎక్కడా తాగు నీటి ప్రమాణాలకు విరుద్ధమైన విలువలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో అందిన అర్జీలపై స్పష్టమైన విచారణ చేపట్టి అర్జీదారు సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని చిన్నారులకు త్వరితగతిన నమోదు చేయాలని స్పష్టం చేశారు. నైపుణ్య శిక్షణకు గ్రామీణ యువత నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎం.పి.డి.ఓలు ఇందులో క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు. డి.డి.యు – జి.కె.యు క్రింద శిక్షణ, ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలులో ప్రజలకు సంతృప్తికరంగా ఉండేందుకు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్, వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు ఆంజనేయులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు ఎస్. వెంకట రావు, జిల్లా ఎస్.జి.ఎస్.డబ్ల్యు అధికారి ఆర్.రామలింగేశ్వర రెడ్డి, ఎస్.జి.ఎస్.డబ్ల్యు సమన్వయ అధికారి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review