BAPATLA DISTRICT CITY NEWS : కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నేత వీర రాఘవ

City News Telugu

చిన్నగంజాం, బాపట్ల జిల్లా: బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో ప్రాధాన్యత కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

పర్చూరు నియోజకవర్గం ఇసుకదర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. బీసీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు.About Us

ఈ సందర్భంగా బీసీ సమాజ అభ్యున్నతికి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చిన్నగంజాం మండలం నుంచి బాపట్ల పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నక్కల వీర రాఘవ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు వాటుపల్లి ఏడుకొండలు, కొక్కిలిగడ్డ విష్ణు, దండ్రుప్రోలు తిరుపతిరావు, దండ్రుప్రోలు బాలరాజు, కొక్కిలిగడ్డ రాములు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES

https://www.youtube.com/@bapatlacitynewstelugu

Share This Article
Leave a review