Markapur District City News : 29వ యూనిట్‌లో టీడీపీ కార్యక్రమం-ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో పార్టీ బలోపేతంపై నాయకుల దృష్టి

S Sarath
3 Views

కనిగిరి, అక్టోబర్ 7:- కనిగిరి మున్సిపాలిటీ 29వ యూనిట్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు 29వ యూనిట్ ఇంచార్జీ షేక్ మస్తాన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పట్టణంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.#AmaravatiCapitalConstruction #APGrowthEngine #AndhraPradeshNews #AmaravatiUpdates #TDPvsYCP #APInfrastructure

కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్, క్లస్టర్ ఇంచార్జీలు బుల్లా బాలబాబు, షేక్ ఖాజా రహిమన్, కనిగిరి నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ జంషీర్ అహ్మద్, టీడీపీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review