GUNTUR DISTRICT NEWS: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాజకీయాలు చేస్తున్నారు

Karthik
4 Views

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా యునివర్సిటీ లోపల ప్లేక్చీ, బ్యానర్స్ పెట్టడాన్ని నాగార్జున యూనివర్సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఖండించింది. ఈమేరకు యూనివర్సిటీ ఇన్చార్జి పంతగాని రమేష్ మాట్లాడుతూ యునివర్సిటీ లోపల రాజకీయాలు వద్దు అని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తీసి వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకీ వున్న వైఎస్సార్ పేరు మార్చడం జరిగిందని చెప్పారు. అలాంటప్పుడు యునివర్సిటీ లోపల తెలుగుదేశం పార్టీ అధినేత బ్యానర్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. యునివర్శటీ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అధికారులు ఆపకపోతే ఇక నుంచి మా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీలు, బ్యానర్స్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేయక తప్పదని హెచ్చరించారు.

Author
Share This Article
Leave a review