కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మంగళవారం తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తాహసిల్దార్ గోపాలకృష్ణ కార్యాలయ పునరుద్ధరణ పనులను వివరించారు. కార్యాలయం చక్కగా తీర్చిదిద్దినందుకు తాహసిల్దార్ ను అభినందించారు. మంచి కార్యాలయం ఉండటం వలన విధుల నిర్వహణ ఆహ్లాదకర వాతావరణంలో చేయవచ్చని అన్నారు. అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. తెనాలి ప్రాంతంలో జరిగే గృహ నిర్మాణ పనులు ఇతర అభివృద్ధి పనులను గురించి తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ్ అప్పలనాయుడు, గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ తో చర్చించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా చేయుటకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పేదలకు సొంత ఇంటి కల అపురూపమని దాన్ని నిజం చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులపై శనివారం ఒక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.
GUNTUR DISTRICT NEWS: తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
36°C
Vijayawada
scattered clouds
36° _ 36°
38%
4 km/h
Tue
34 °C
Wed
42 °C
Thu
41 °C


