రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. పెద్దల పర్యవేక్షణ లేకుండా కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకూడదని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలిపింది. పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులకు సైతం సూచనలు చెప్పి, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని పేర్కొంది.
AP LATEST NEWS: ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Oplus_16908288
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
33°C
Vijayawada
few clouds
33° _ 33°
59%
1 km/h
Sat
31 °C
Sun
35 °C
Mon
38 °C


