టీడీపీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. టీడీపీ వర్కింగ్ కమిటీ నిర్మాణాన్ని పరిశీలిస్తే అది స్పష్టమవుతుందని అన్నారు. తాను ఒక గిరిజన మహిళగా రెండు మంత్రిత్వ శాఖలు, పొలిట్‌బ్యూరో సభ్యత్వం పొందిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీలో మహిళలను సొంత చెల్లెల్లుగా గౌరవిస్తారని, అదే పార్టీ విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ‘కోడి కత్తి’ కేసులో శ్రీను పరిస్థితిని గుర్తు చేసుకోవాలని అన్నారు. పార్టీ కోసం నేరం చేసి సంవత్సరాల పాటు జైలులో ఉన్నప్పటికీ జగన్ అతనిని పట్టించుకోలేదని విమర్శించారు. ‘రప్ప రప్ప’ ప్లకార్డులు పట్టుకుని జైలుకు వెళ్లే పరిస్థితులు తెచ్చుకోకుండా తమ జీవితాలను కాపాడుకోవాలని వైసీపీ కార్యకర్తలకు సూచించారు. జగన్మోహన్ రెడ్డి మీ కోసం ఏమీ చేయరని, మీ జీవితాలను మీరు పాడుచేసుకోవద్దని వైసీపీ కార్యకర్తలకు హితవు పలికారు.



