రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా గుంటూరు నగరంలో మురుగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన డ్రెయిన్ల పూడికతీత పనులు నాణ్యతతో, డ్రైన్ పూర్తి లోతు వరకు తీయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న సుమారు 3,129.45 కిలోమీటర్ల మొత్తం డ్రైనేజీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని, అందులో సమస్యాత్మకమైన 179.45 కిలోమీటర్ల మేజర్ మరియు మీడియం డ్రెయిన్లలో 61 పనులను రూ.3.68 కోట్ల అంచనా వ్యయంతో ప్రాధాన్యత క్రమంలో పూడికతీత పనులు చేపట్టామని, మిగిలిన మైనర్ డ్రైన్లలో రోజువారీగా పారిశుధ్య కార్మికులు గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేసేలా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించామన్నారు. పూడికతీత పనులను వర్షాలకు ముందుగానే మే 31వ తేదీ లోపు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయడంతో పాటు పనులు చేసిన కాంట్రాక్టరే 90 రోజులపాటు నిర్వహణ భాద్యత కూడా అప్పగిస్తూ స్పష్టమైన ఆదేశాలను అధికారులకు జారీ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో సమగ్రంగా పూడికతీత పనులు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. పూడికతీసిన కాంట్రాక్టరే మరో 90 రోజులు భాధ్యత వహించేలా నిబందన టెండర్ అగ్రిమెంట్ లోనే పొందుపరచడం వలన పనుల్లో భాధ్యతారాహిత్యం తగ్గుతుందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 30 పనులను రూ.1.92 కోట్లు, పశ్చిమలో 23 పనులను రూ.1.26 కోట్లతో, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలలో 8 పనులను రూ.50.22 లక్షలతో పూడికతీత పనులకు ఆమోదం తెలిపామన్నారు. ప్రధాన కాలువలలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడానికి అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ బృందాలు, స్థానిక పర్యవేక్షణ కమిటీలు కల్వర్టులు మరియు చౌక్ పాయింట్ల వద్ద నిరంతరం పరిశీలిస్తాయన్నారు. రోజువారీ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఎస్ఈని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినా నగరంలో ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా, జనజీవనం సజావుగా సాగేలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా కాలువల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
GUNTUR CITY NEWS: గుంటూరులో డ్రైన్ ల పూడిక తీత పనులు ప్రారంభం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
broken clouds
32° _ 32°
66%
2 km/h
Thu
32 °C
Fri
38 °C
Sat
35 °C


