GUNTUR CITY NEWS: గుంటూరులో రోడ్లపైనే చెత్త – పట్టించుకోని కార్పోరేషన్ యంత్రాంగం

Karthik
12 Views

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ సాబ్ జరా చూడండి మన సిబ్బంది పనితీరు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. నడిరోడ్డుపై చెత్తను డంప్ చేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన తీరు. సాక్షాత్తు జాతీయ రహదారి పైనే చెత్తను వదిలివెల్లిన నిర్లక్ష్యపు సిబ్బంది. జాతీయ రహదారి అయిన గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్లే రహదారి అంకిరెడ్డి పాలెం పొత్తూరు మధ్యలో వినాయకుడి గుడి, కేర్ డెంటల్ కళాశాల ఎదురుగా చెత్తను డంప్ చేసిన వైనం. సాక్షాత్తు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలలో ప్రతి నిత్యం ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇంతకు మునుపు చెత్తను జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా వేసేవారు. కానీ నేడు జాతీయరహదారి పైనే వదిలేసి వెళుతున్నారు. అంటే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు. జాతీయ రహదారిపై ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు చేస్తూ ఉంటాయి. అంతేకాదు కూతవేటు దూరంలో కళ్ళకు కనిపించేంత దూరంలో పవిత్రమైన వినాయకుడి దేవాలయం. ప్రముఖ ఆసుపత్రి వున్న ప్రాంతంలో కావాలని వదిలారా అనే అనుమానం కలుగుతుంది. అవ్వా నవ్విపోదురు గాక నాకేంటి అన్న తీరుగా మునిసిపల్ సిబ్బంది తీరు ఉందటూ ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు.

Author
Share This Article
Leave a review