GUNTUR DISTRICT NEWS: గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా|| ఎన్.వి. సుందరాచారిని సత్కరించిన పౌర సంస్థలు

Karthik
8 Views

శిధిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను దాతల సహకారంతో కేవలం సంవత్సర కాలంలోనే దాదాపు పది కోట్లకు పైగా విరాళాలను సేకరించి, ఆధునీకరించి, పునః నిర్మించడాన్ని అభినందిస్తూ ఈ నెల 24 వ తేదీన శుక్రవారం డా|| యన్.వి. సుందరాచారిని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా|| ఆలా వెంకటేశ్వర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, గుంటూరు రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి లు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డా|| ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ పూర్వ విద్యార్థుల సహకారంతో న్యూరాలజీ డిపార్ట్ మెంట్ ను కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి అభివృద్ధి చేయడంలో డా|| యన్.వి. సుందరాచారి పాత్ర కీలకమైందన్నారు. 30 సంవత్సరాల తర్వాత గుంటూరు మెడికల్ కళాశాలలో మెడికల్ ఎగ్జిబిషన్ ను అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. గతంలో పదవీ విరమణ తర్వాత డాక్టర్ కె.అంజి రెడ్డి గారి సేవలను ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుందో అదే విధంగా నేడు కూడా పదవీ విరమణ అనంతరం డా|| ఎన్.వి. సుందరాచారి సేవలను ఉపయోగించుకోవలసినది గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని, రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ లకు విజ్ఞప్తి చేశారు. డా || ఎన్.వి.సుందరాచారి లాంటి సమర్థత, నిజాయితీ, సేవా దృక్పథం గల వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రజలపై ఉందన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డా|| ఎన్.వి.సుందరాచారి 34 సంవత్సరాల వైద్య వృత్తిలో ఉండి న్యూరాలజీ ఫిజిషియన్ గా లక్షలాది రోగులకు అద్భుతమైన చికిత్స అందించారన్నారు. 1946లో ప్రారంభమైన గుంటూరు మెడికల్ కళాశాలను కార్పొరేట్ స్థాయి వైద్య కళాశాల స్థాయికి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఫెలో ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇంగ్లాండు కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ సర్టిఫికెట్ ను పొందిన డా || ఎన్.వి. సుందరాచారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యలో ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు అందించి సత్కరించిందన్నారు. 9.5 ఎకరాలలో నిర్మితమైన గుంటూరు మెడికల్ కళాశాలలో అన్ని వైద్య విభాగాలను ఆధునీకరించడం,గ్రంథాలయం ను, క్యాంటీను అభివృద్ధి చేయడం అన్ని విభాగాలల్లో ఎయిర్ కండిషన్స్ తోపాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో డాక్టర్ ఎన్.వి. సుందరాచారి కృషి మరవలేని దన్నారు. వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం తర్వాత గుంటూరు మెడికల్ కళాశాల రెండవ స్థానంలో ఉందని, దేశవ్యాప్తంగా మొదటి 50 స్థానాలలో గుంటూరు మెడికల్ కాలేజీ ఉండే విధంగా డాక్టర్ ఎన్. వి సుందరాచారి కృషి చేస్తునారన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి పక్షవాతంపై డాక్టర్ సుందరాచారి కీలక పరిశోధనలు చేశారన్నారు. డాక్టర్ సుందరాచారి కృషితో న్యూరాలజీ మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగి తెలుగు రాష్ట్రాలలోని అత్యధిక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు గల మెడికల్ కళాశాల గా గుంటూరు మెడికల్ కళాశాల చేరిందన్నారు. డాక్టర్ సుందరాచారి స్వయంగా పౌర సంస్థల ప్రతినిధులను గుంటూరు మెడికల్ Dispatch ఉన్న అన్ని విభాగాలను చూపిస్తూ, మెడికల్ కళాశాల అభివృద్ధి క్రమాన్ని వివరించారు.

Author
Share This Article
Leave a review