గుంటూరు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఈ నెల 28 నుండి జూన్ 6వ తేదీ వరకు విద్యార్థులకు విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 98 శాఖా గ్రంధాలయాలలో కూడ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాఠశాల బాలబాలికలు విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వేసవి విజ్ఞాన శిబిరాలలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు పెంపొందించుటకు పుస్తక పఠనా కార్యక్రమం, నైతిక విలువలు, కథా వాచనము, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయుట, కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడుట మెరుగుపరచుట, చిత్రలేఖను, హస్త కళలు చెస్, క్యారం పోటీలు వ్యాసరచన, డిబేట్ పోటీలు క్విజ్ సైన్స్ ప్రోగ్రామ్స్ పర్యావరణ ఆరోగ్య పరిశుభ్రత, సామాజిక సేవ, కార్టూన్, డ్రాయింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సాంస్కృతి కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామని అన్నారు. ఇందులో పాల్గొని, ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామని అన్నారు. తల్లిదండ్రులు ఈ విజ్ఞాన శిబిరాలకు తమ పిల్లలు హాజరయ్యే విధంగా ప్రోత్సహించి, వారి మనోవికాసానికి దోహదం కావాలని విజ్ఞప్తి చేశారు.
GUNTUR DISTRICT NEWS: ఈనెల 28 నుండి కేంద్ర గ్రంధాలయంలో విజ్ఞాన శిబిరాలు

Total Views: 0
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
scattered clouds
31° _ 31°
62%
3 km/h
Sat
31 °C
Sun
40 °C
Mon
41 °C


