
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గూగుల్ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. మన దేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు కార్డు ‘ఆధార్’ (Aadhaar) ఇకపై మీ గూగుల్ వాలెట్‌లోకి వచ్చేసింది. ఫిజికల్ కార్డును పర్సులో మోయాల్సిన అవసరం లేకుండానే, మీ డిజిటల్ ఆధార్‌ను ఫోన్‌లో భద్రపరుచుకునే వెసులుబాటును గూగుల్ కల్పించింది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)తో గూగుల్ ప్రతిష్టాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.
అసలు దీనివల్ల ప్రయోజనం ఏమిటి? గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్న ప్రకారం, ఇకపై ఎక్కడైనా ఆధార్ వివరాలను ధ్రువీకరించాల్సి వస్తే నేరుగా ఈ వాలెట్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అవసరాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) వంటి థియేటర్లకు వెళ్లినా లేదా భారత్ మ్యాట్రిమొనీ వంటి వేదికల్లో వివరాలు వెల్లడించాల్సి వచ్చినా, వాలెట్ ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు. వయసును మాత్రమే ధ్రువీకరించాల్సిన చోట పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రైవసీని కూడా ఇది కాపాడుతుంది.
గూగుల్ వాలెట్ ఇంటర్‌ఫేస్ & సెటప్): త్వరలోనే మైగేట్, స్నాబిట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మరి ఈ డిజిటల్ కార్డును ఎలా సేవ్ చేసుకోవాలి? ప్రక్రియ చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ గూగుల్ వాలెట్ యాప్‌ను ఓపెన్ చేయండి. అక్కడ కింద కనిపించే ‘యాడ్ వాలెట్’ (+) బటన్‌ను క్లిక్ చేయాలి. మెనూలో ‘ఐడీ పాస్’ లేదా ‘ఆధార్ కార్డ్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌తో లింకైన మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే సరి.. మీ డిజిటల్ ఆధార్ సిద్దమవుతుంది.
అంతేకాకుండా, UIDAI అధికారిక యాప్ లోని ‘షేర్ ఐడీ’ ఆప్షన్ ద్వారా కూడా మీ వివరాలను గూగుల్ వాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు. సాంకేతిక రంగంలో గూగుల్ తీసుకువచ్చిన ఈ మార్పు డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు అని చెప్పవచ్చు. ఇక పర్సులో కార్డులు వెతుక్కునే పనిలేకుండా మీ స్మార్ట్‌ఫోనే మీ ఐడెంటిటీగా మారబోతోంది. టెక్నాలజీ ప్రపంచంలోని మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. కెమెరామెన్ కిరణ్‌తో, న్యూస్ డెస్క్.


