Nellore City News:మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్-QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు

Sharat
1 View

నెల్లూరు:– మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చే దిశగా నెల్లూరు పోలీస్ శాఖ కీలక చర్య చేపట్టింది. నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ ఆధ్వర్యంలో QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను ప్రారంభించారు.

ఈ విధానంలో జర్నలిస్టులకు ప్రత్యేక QR కోడ్‌తో కూడిన డిజిటల్ మీడియా పాస్‌ను అందించనున్నారు. పాస్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత మీడియా ప్రతినిధి వివరాలను క్షణాల్లో ధృవీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో మీడియా ప్రతినిధుల గుర్తింపు మరింత సులభతరం కావడంతో పాటు నకిలీ మీడియా పాస్‌ల వినియోగానికి అడ్డుకట్ట పడనుంది.

మీడియా మిత్రుల అభ్యర్థన మేరకు సోమవారం కూడా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో QR కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అర్హత కలిగిన మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదే తరహాలో QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ విధానాన్ని త్వరలో తిరుపతిలోనూ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మీడియా ప్రతినిధుల గుర్తింపు వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఈ విధానం ఉపయోగపడనుంది.

Author
Share This Article
Leave a review