Vijayawada city news :సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన-126 మందికి వైద్య సేవలు

Sharat
1 View

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారాంతాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి.

38వ డివిజన్‌లోని కుమ్మరిపాలెం సెంటర్, లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్ వద్ద శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో నిపుణులైన వైద్యుల బృందం 126 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించింది. అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ శిబిరంలో డెంటల్ పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, బీపీ, షుగర్‌తో పాటు ఇతర రక్త పరీక్షలు నిర్వహించారు. అలాగే జనరల్ ఫిజీషియన్లు రోగులను పరీక్షించి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్య సలహాలు ఇచ్చారు.

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.

శిబిరంలో వాసన్ ఐ కేర్, పీవీఆర్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు.

Author
Share This Article
Leave a review