GUNTUR DISTRICT NEWS: సెల్ ఫోన్ లకు దూరంగా ఉండండి – పుస్తకాలు పట్టండి

Karthik

గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ మహిళా, బాలల గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అడల్ట్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ చావ బోసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు ఎ.వి.కె. సుజాత, రిటైర్డ్ టీచర్ వ్యాఖ్యాన సరస్వతి, ప్రాసరత్న , గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, సి.హెచ్ . శ్రీనివాస రావు, రిటైర్డ్ ప్రాజెక్టు ఆఫీసర్, అడల్ట్ ఎడ్యుకేషన్, యం. పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ” సెల్ ఫోన్ వదలండి – పుస్తకాలు పట్టండి” అనే నినాదంతో విద్యార్థి, విద్యార్థినీలు , అతిథులు , గ్రంథాలయ పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది ర్యాలీలో చేపట్టారు. ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పుస్తక పఠనం అలవాటు చేయడం , శతక పద్యాలు నేర్పించడం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, ఆటలు , యోగ శిక్షణ, కంప్యూటర్ పరిచయం, పేపర్ క్రాఫ్ట్స్ నేర్పించబడును అని గ్రంథాలయాథికారి బి.శకుంతల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గా డా. ఆర్. సుజాత లక్ష్మి , హెచ్.ఓ.డి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ , విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ , మానసిక విజ్ఞానం , వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లు మరియు పోషకాహారంపై అవగాహన గురించి నేర్పిస్తారు. కొణతం నాగేశ్వరరావు , రిటైర్డ్ టీచర్ మరియు కవి విద్యార్థులకు శతక పద్యాలు నేర్పిస్తారు. కె. వెంకట కార్తీక్ డిగ్రీ విద్యార్థి పిల్లలకు కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్పిస్తారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review