chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలి

CPI DEMAND HOUSE SITES FOR PUBLIC

పాత గుంటూరు పార్కు సెంటర్లో సిపిఐ 8 వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టణ, నగరంలో వున్న అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ అర్జీలు పూర్తి చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని పేదలకు నగరంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం సాధించుకొనేందుకు సిపిఐ పార్టీ వారు రాసే అర్జీలు కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది నుండి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇళ్లు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చారని ఇది సరిపోదు.. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, పెరిగిన ధరల రీత్యా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, ఈ అంశంపై సిపిఐ గా మేము రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మొన్న జరిగిన క్యాబినెట్లో చేసిన ఇళ్ల స్థలాల తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఇల్లు లేని నిరుపేదలందరూ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారందరికీ 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఐ పార్టీగా మేము ఆయా డివిజన్లో రాస్తున్న అర్జీ కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలందరూ పాల్గొని అర్జీలు రాయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, నూతలపాటి చిన్న, 8వ డివిజన్ సిపిఐ కార్యదర్శి కట్టా శ్రీనివాస్ రావు, స్థానిక నాయకులు కాయల రామారావు, నాగరాజు, రాజేష్, సతీష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker