SSC ఫలితాల్లో గొల్లపల్లి ZP హైస్కూల్ అద్భుత విజయం
మార్కాపురం జిల్లాలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలోని జెడ్పి హైస్కూల్ ఈ ఏడాది ఎస్ఎస్సి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. పాఠశాలలో మంచి ఉత్తీర్ణత నమోదవడం స్థానికంగా గర్వకారణంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోరని మరోసారి నిరూపించారు.
ఈ ఫలితాల్లో తరగతిలో మీసాల రజని ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు పేరు తెచ్చింది. అలాగే ఇతర విద్యార్థులు కూడా మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.ఎం. రజని 518 , శ్రీలక్ష్మి గోవిందమ్మ 514 మార్కులు, బీ. మేఘన 504 మార్కులు, ఎన్. ప్రవీణ్ 501 మార్కులు, మార్కులు సాధించడం విశేషం.
సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఉచితంగా చదువుకుంటూనే, సెలవు దినాల్లో తల్లిదండ్రుల వ్యవసాయ పనులకు సహాయపడుతూ ఇలాంటి మంచి ఫలితాలు సాధించడం ప్రశంసనీయమైన విషయం. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించవచ్చని ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ సందర్భంగా విద్యార్థుల కృషిని అభినందిస్తూ, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్ మాట్లాడుతూ, భవిష్యత్తులో విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించాడు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
మొత్తంగా, గొల్లపల్లి జెడ్పి హైస్కూల్ ఈ ఏడాది ఎస్ఎస్సి ఫలితాల్లో సాధించిన విజయంతో జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందింది.



