జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు మొత్తం 433 అర్జీలు అందాయి. అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 199, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 163 అర్జీలు, గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 5 అర్జీలు, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 24 అర్జీలు, గుంటూరు నగర పాలక సంస్థకు 36, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో 6 అర్జీలు అందాయి. సోమవారం ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. అర్జీదారులు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేయాలని, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగ రాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు,పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ, ఇన్ ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రావణ్ బాబు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పర్యాటక అధికారి రమ్య, దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ మాధవి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: పి.జి.ఆర్.ఎస్ కు 433 అర్జీలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
34°C
Vijayawada
scattered clouds
34° _ 34°
55%
5 km/h
Mon
33 °C
Tue
40 °C
Wed
40 °C


