GUNTUR CITY NEWS: గుంటూరు ప్రజలకు జన గణన అలెర్ట్

Karthik

దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. గురువారం శ్యామల నగర్ 9వ లైన్‌లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు ఇళ్లలో ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహించారు. నగరవ్యాప్తంగా మిగిలి ఉన్న ఇళ్ల గణనను రాబోయే 2 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ వివరాలు, పిన్ లేదా ఓటీపీ అడగరన్న కమిషనర్. ఒక్కో ఇంటికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఖచ్చితమైన వివరాలు అందించి ప్రభుత్వానికి సహకరించాలని కోరిన కమిషనర్. జన గణనపై సందేహాలకు జిఎంసి కాల్ సెంటర్ 0863-2345105 నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు.

Author
Share This Article
Leave a review