GUNTUR DISTRICT NEWS: లక్షలు విలువ చేసే మందులు జీజీహెచ్ లో రోగులకు ఉచితంగా పంపిణీ

Karthik

నంబూరు గ్రామానికి చెందిన 19 సం.ల వయసు గల షేక్ ఖాదర్ భాషా రోజు రోజుకి శారీరికంగా క్షీణించే Spinal Muscular Atrophy అను వ్యాధితో బాధపడుచూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాల కు వచ్చారు.వైద్యులు పరీక్షించి అతనికి నిర్దేశించిన Risidiplam అనే మందు బయట షాప్ లలో లక్షల రూపాయల ధర కలిగి ఉంది. ఈ మందు ప్రభుత్వ సరఫరా లో లేనందువలన స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెంటనే స్పందించి నాట్కో ఫార్మా కంపెనీ యాజమాన్యాన్ని తమ తయారీలో గల ఈ మందును రోగికి అందించ వలసినదిగా కోరారు.ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు బహు విధాలుగా సహకరిస్తున్న నాట్కో సంస్థ శాసనసభ్యుని కోరిక మేరకు ఆ మందులను రోగికి ఉచితంగా ఏర్పాటు చేసింది.ఈ రోజు సూపరింటెండెంట్ గారి కార్యాలయంలో డా.SSV రమణ సమక్షంలో నాట్కో సమన్వయకర్త యడ్లపాటి అశోక్ కుమార్ 10 సీసాల మందులను రోగి తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. సమయానికి స్పందించి సహాయం చేసిన శాసనసభ్యులకు , నాట్కో సంస్థకు రోగి తల్లిదండ్రులు కృతఙ్ఞతలు తెలిపారు.

Author
Share This Article
Leave a review