ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. స్వర్థ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో దుగ్గిరాలలో శనివారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యావరణహిత వస్తువుల ప్రదర్శనను తిలకించారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దుగ్గిరాల ప్రకృతి అందాలకు నిలయంగా ఉందన్నారు. నీటి వసతులు, పచ్చదనం ఉన్నాయని దీనిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం పరిశుభ్రతకు ఆలవాలం కావాలని అన్నారు. గ్రామ సీమలు పరిశుభ్రతకు, పచ్చదనానికి చిరునామా కావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి పరిశుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్యం అనే ఆలోచన ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి సారించాలని సూచించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పక్కాగా నిర్వహించాలని అన్నారు. గ్రీన్ ఎంటర్ ప్రేన్యూయర్ వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నివారణ పట్ల దృష్టి సారించాలని సూచించారు. చెత్తతో ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు పడాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, వ్యాపార వేత్తలు గ్రీన్ ఎంటర్ ప్రేన్యూయర్ లుగా ఎదుగుటకు ప్రోత్సహించాలని చెప్పారు. రీసైక్లింగ్ రిపేర్ అండ్ రియూస్, కాంపోజిటింగ్, అప్ సైక్లింగ్ ఆధారిత వ్యాపారాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇంటి పద్దనే పొడి వ్వర్ణాలను వేరు చేయడం అవసరమని, స్వచ్ఛ రథం ద్వారా సేకరణ చేయాలని దీని పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛ రథం సేకరించిన పొడి వ్వర్ణాలను గ్రీన్ అంబాసిడర్లు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని అన్నారు. తడి వ్యర్థాలను సేకరించి వర్మి కంపోస్ట్ తయారు చేయాలని అన్నారు. *పరిశుభ్ర గ్రామం – ఆరోగ్య గ్రామం*ప్రతి గ్రామపంచాయతీలో పరిశుభ్ర గ్రామం – ఆరోగ్య గ్రామం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛ గ్రామం – ప్లాస్టిక్ రహిత గ్రామం – గ్రీన్ ఆంధ్ర లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, స్థానికులు వాసు, బలరాం తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయం కావాలి

Oplus_16908288
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
moderate rain
30° _ 30°
75%
2 km/h
Fri
32 °C
Sat
30 °C
Sun
27 °C


