GUNTUR DISTRICT NEWS: ఈనెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు

Karthik

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్ఆర్సిపి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈనెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగనన్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు విడుదల చేశారు. 4వ తేదీన మండల కేంద్రాల్లో 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, సదస్సులు జరగనున్నాయి. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Author
Share This Article
Leave a review