GUNTUR CITY NEWS: మైనార్టీ విద్యార్థులకు ఎమ్మెల్యే నసీర్ ఆర్థిక సాయం

Karthik

పరీక్షా విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది ఎంపికముస్లిం పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు ద్వారా పునాదులు వేసే గొప్ప కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన తాలీమ్-ఎ-హునార్ కార్యక్రమం ద్వారా ఎంపికైన విద్యార్థులతో ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎండీ ఫరూక్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సలహాదారులు షరీఫ్, ఏపీ ఓ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఏడాది ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్యతోపాటు కాంపిటేటివ్ పరీక్షల్లో కోచింగ్ అందించేలా ఈ కార్యక్రమం చేపట్టారు. దీని కోసం సుమారు రూ.10 కోట్లు వెచ్చించనున్నారు. మైనార్టీ విద్యార్థులకు వక్ఫ్ బోర్డ్ తో పాటు తన వంతుగా చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే నసీర్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ కుటుంబాల నుంచి వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులను తయారు చేయాలనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు లక్ష్యమ‌ని తెలిపారు. ముస్లిం మైనారిటీ సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.2 లక్షలు వెచ్చిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తన వంతు మరింత సాయం అందిస్తానని స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review