GUNTUR DISTRICT NEWS: PGRS అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

Karthik

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీదారుల సమస్యలను సావధానంగా అర్థం చేసుకుంటేనే నాణ్యమైన పరిష్కారం అందించేందుకు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ ఖాజావలి , డిప్యుటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, గంగరాజు, డేవిడ్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా అర్థం చేసుకుంటేనే నాణ్యమైన పరిష్కారం అందించేందుకు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review