ఏలూరు: ఏలూరు నగరంలోని వన్‌టౌన్ నేరల రాజా కళ్యాణ మండపంలో ఆదివారం ఏలూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణలో ఆర్యవైశ్య సంఘం కీలక పాత్ర పోషించాలని, నూతన కార్యవర్గం సమిష్టిగా పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. సమాజ ఐక్యత, సేవా దృక్పథంతో ముందుకు సాగితే సంఘానికి మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు నంగులూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నున్న శ్రీనివాస్, కోశాధికారి కనిగొల్ల రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దుల పవన్ కుమార్, ద్వారకాతిరుమల దేవస్థానం బోర్డు డైరెక్టర్ చలవాది బ్రహ్మయ్య, ఆర్యవైశ్య నాయకుడు చక్క రాజా, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడవల్లి వాసు, టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణ కుమారి, ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



