అంగన్వాడీలను సంతృప్త స్థాయిలో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ లో ఎల్లప్పుడూ సానుకూల స్పందన పొందేవిధంగా ఎప్పుడూ పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా తనిఖీ చేయాలని సీడీపిఓ లను, పర్యవేక్షకులను ఆదేశించారు. శాఖకు సంబంధించిన అన్ని నివేదికల్లో – ప్రీస్కూల్ అటెండెన్స్, ఆపార్ ఐడి క్రియేషన్, లబ్ధిదారుని అభా ఐడి క్రియేషన్, టేక్ హామ్ రేషన్ పంపిణీ, పాన్ కుడి, ఏ.ఐ.ఇ.సి.డి స్క్రీనింగ్, గ్రోత్ మానిటరింగ్, పి.ఎం.ఎం.వి.వై, సరుకుల నమోదు తదితర శాఖా పరమైన సూచీలకు అనుగుణంగా ఖచ్చితమైన, నాణ్యమైన డేటాను నమోదు చేసి, లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలు అందించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పి.జి. ప్రసూన, సి.డి.పి.ఓ లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.



