Bapatla Distric News :కస్తూర్బా పాఠశాలలో రూ.2.46 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్-సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Sharat
1 View

చిన్నగంజాం, ఆగస్టు 6 :– బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో రూ.2.46 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థినులు ప్రయోగాత్మకంగా విజ్ఞానాన్ని అభ్యసించే అవకాశం కలుగుతుందని, కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ విద్యకు మరింత తోడ్పాటునిస్తుందని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోని నూతన తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించారు. విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review