Bapatla City news :కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఇంటింటికీ ప్రచారం

Sharat
1 View

బాపట్ల:– బాపట్ల మండలం మురకుండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి” కార్యక్రమంలో భాగంగా “ఇంటింటికీ తెలుగుదేశం” ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని నాయకులు తెలిపారు.

గ్రామంలోని ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review